
చిరునవ్వు వెనుక దాగి ఉన్న క్రూరమైన ముఖాన్ని చూసిన వారందరూ భయపడ్డారు. తాళి కట్టిన భర్తనే అంతమొందించింది ఓ భార్య. మృతదేహాన్ని ముక్కలుగా నరికి, సిమెంట్ కలిపి డ్రమ్ములో పూడ్చేసింది. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లోని ముస్కాన్‌లో జరిగినటువంటి ఇలాంటి కేసు రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గోపాలి అనే మహిళ తన ప్రేమికుడు దీనదయాళ్ తో కలిసి తన భర్తను చంపించింది. మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని ఇద్దరూ ఐదు కిలోమీటర్లు తిరుగుతూనే ఉన్నారు. ఆ తర్వాత ముస్కాన్ లాగానే మృతదేహాన్ని గుర్తుపట్టకుండా నిర్జన ప్రదేశంలో తగలబెట్టడానికి ప్రయత్నించింది.
ఈ అత్యంత పాశవిక ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. జైపూర్ సౌత్‌లో నివసించే గోపాలి దేవి(42), ఆమె భర్త ధన్నాలాల్ సైనితో కలిసి దీన్‌దయాల్(30) అనే వ్యక్తి కూరగాయల దుకాణంలో పని చేసేవారు. దీన్‌దయాల్ గోపాలి కంటే 12 సంవత్సరాలు చిన్నవాడు. అయినప్పటికీ, గోపాలి – దీన్‌దయాల్ క్రమంగా అనైతిక సంబంధాన్ని పెంచుకున్నారు. ఈ విషయం ధన్నాలాల్‌కు తెలియగానే, దీనదయాళ్‌ను నిలదీశాడు.
కూరగాయల దుకాణంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు బెదిరించారు. ధన్నాలాల్ తన భార్య గోపాలీ దేవిని దీనదయాళ్ దుకాణంలో పని చేయడానికి నిరాకరించాడు. కానీ గోపాలీ అంగీకరించలేదు. ధన్నాలాల్ నిరాకరించినప్పటికీ ఆమె దీనదయాళ్ దుకాణంలో పనికి రావడం కొనసాగించింది. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న దీన్ దయాళ్, ధన్నాలాల్ ను అడ్డు తొలగించమని గోపాలిని కోరింది. అప్పుడు ఇద్దరూ కలిసి ధన్నాలాల్‌ను హతమార్చేందుకు ఒక పథకం వేశారు.
చివరకి దీనదయాళ్, గోపాలి కలిసి ధన్నాలాల్‌ను హత్య చేశారు. అనంతరం ముక్కలు ముక్కలుగా నరికేశారు .హత్య చేసిన తర్వాత, ఇద్దరూ మృతదేహాన్ని పారవేయాలని అనుకున్నారు. దీనదయాళ్ బైక్ తీసుకొని గోపాలిని తన వెనుక కూర్చోబెట్టి ధన్నాలాల్ మృతదేహాన్ని ఒక సంచిలో వేసి మధ్యలో ఉంచాడు. వారిద్దరూ ఆ శవాన్ని నిర్జన ప్రదేశంలో పడేయడానికి ఐదు కిలోమీటర్లు తిరుగుతూనే ఉన్నారు. వారిద్దరూ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తుండగా సీసీటీవీలో రికార్డైంది.
గోపాలి బైక్ వెనుక కూర్చుని ఒక సంచి పట్టుకుని ఉన్నట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. వారిద్దరూ పట్టపగలు మృతదేహంతో తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎవరికీ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. తరువాత వారిద్దరూ ధన్నాలాల్ మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో దహనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటి రోజు ఉదయం, పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు. దంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కూపీ లాగారు. వారిద్దరూ మార్చి 16వ తేదీన ఈ నేరానికి పాల్పడ్డారు. మూడు రోజుల తరువాత, మార్చి 20న, గోపాలి, దీన్‌దయాళ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో, గోపాలి తన భర్త ధన్నాలాల్‌ను తన ప్రియుడ దీన్‌దయాల్‌తో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితులిద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు జైపూర్ సౌత్ డీసీపీ దిగంత్ ఆనంద్ తెలిపారు. ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుండి ఇద్దరినీ జైలుకు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..