భయాన్నే భయపెడతాడు

Written by RAJU

Published on:

భయాన్నే భయపెడతాడుఅజిత్‌ కుమార్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన మల్టీ లాంగ్వేజ్‌ ప్రాజెక్ట్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. టి-సిరీస్‌ గుల్షన్‌ కుమార్‌, భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్‌ మూవీ ఇప్పటికే ప్రమోషనల్‌ కంటెంట్‌తో సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్‌ తెలుగు ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. హీరో అజిత్‌ను డిఫరెంట్‌ అవతార్స్‌లో నెవర్‌ బిఫోర్‌ క్యారెక్టర్‌లో ప్రజెంట్‌ చేసిన ట్రైలర్‌ అదిరిపోయింది. తన కొడుకును కాపాడుకోవడానికి తన వైలెంట్‌ పాస్ట్‌కి తిరిగి వచ్చే పాత్రలో అజిత్‌ క్యారెక్టరైజేషన్‌ చాలా క్యురియాసిటీని పెంచింది. భయాన్నే భయపెడతాడనే డైలాగ్‌ హీరో క్యారెక్టర్‌ ఎంత పవర్‌ ఫుల్‌గా ఉండబోతోంది సూచిస్తోంది. ట్రైలర్‌లో త్రిష కృష్ణన్‌, అర్జున్‌ దాస్‌, ప్రభు, ప్రసన్న, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, జీవీ ప్రకాష్‌ కుమార్‌ నేపథ్య సంగీతం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి.

Subscribe for notification
Verified by MonsterInsights