– కిటకిటలాడిన ఈద్గా మైదానాలు, మసీదులు
నారాయణపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా సోమవారం ముస్లింలు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారాయణపేటలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, సుధాకర్, సరాఫ్ నాగరాజ్, మాజీ కౌన్సిలర్ ఎండీ.సలీం తదితరులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విజయ్‌సాగర్, చెన్నారెడ్డి, ఓం ప్రకాష్, గోపాల్‌యాదవ్, అమీరుద్దీన్, అబ్దుల్ సలీం, సర్ఫరాజ్, మహినొద్దీన్, యూసుఫ్, తఖీచంద్, సఫీ, మహమూద్, నవాజ్, తాజుద్దీన్, హస్నొ ద్దీన్, జలీల్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఆధ్వర్యంలో డీఎస్పీ లింగయ్య పర్యవేక్షణలో ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. నారాయణపేటలో పలువురి మైనార్టీల నివాసాలకు వెళ్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కాంగెస్ నాయకుడు కుంభం శివకుమార్‌రెడ్డిలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.