– సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ సుంకేట అన్వేశ్ రెడ్డి హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బోగస్ విత్తనోత్పత్తి కంపెనీలున్నాయనీ, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి హెచ్చరించారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పిలవబడుతున్న రాష్ట్రంలో నకిలీ విత్తనం రాజ్యమేలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేసి రైతులకు నట్టేట ముంచాయని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి ఆదేశాలమేరకు ఇటీవల ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తే, భయంకరమైన నిజాలు బయటపడ్డాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల అమా యకత్వం ఆసరాగా చేసుకుని సీడ్ కంపెనీలు, ఏజెంట్లు మోసం చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండ లాల్లో సింజెంటా, హైటేక్, బియర్ అనే మూడు మల్టీనేషనల్ కంపె నీలు చేస్తున్న మోసాలు అన్ని ఇన్ని కావని చెప్పారు. విత్తనోత్పతితో కోసం మల్టీనే షనల్ కంపెనీలు ఆర్గనైజర్స్‌కు ఏ ధర ఇస్తున్నాయో రైతులకు తెలియ దని చెప్పారు. నోటి మాట, తెల్లకాగితాలపై రాసుకోవడం తప్ప ఎక్కడా పక్కా లెక్కలు, బిల్లులు ఉండవని తెలిపారు. ఆర్గనైజర్స్ రైతులకు కావాల్సిన ఇతర పురుగు మందులు ఇచ్చి రైతులకు నుంచి ఐదుశాతం వడ్డీ వసూల్ చేస్తు న్నారని, ఇలాంటి దందా ఒక్కో జిల్లాలో ఒక్కో రకం ఒప్పందం చేసుకొని డబ్బులు వసుల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయా లను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. త్వరలో సీడ్ కార్పొ రేషన్ ఆధ్వర్యంలో ఓ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వనున్నట్టు తెలిపారు.