
బెల్లం చెరకు రసం లేదా తాటి రసం నుండి తయారవుతుంది. ఇది శుద్ధి చేయని సహజ తీపి పదార్థం కాబట్టి ఇందులో ఖనిజాలు, విటమిన్లు సహజంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
- జీర్ణ వ్యవస్థకు మేలు.. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- శక్తిని అందించే సహజమైన మూలం.. దీంట్లో గ్లూకోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటగా ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం తింటే శరీరానికి ఉత్సాహం వస్తుంది.
- రక్తహీనత నివారణ.. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హానికరమైన టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది.
- కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.. బెల్లం నేచురల్ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచి ఆరోగ్యంగా ఉంచుతుంది.
కిడ్నీలకు హానికరమా..?
- బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
- బెల్లంలో సహజంగా చక్కెర ఉండటంతో దీన్ని అధికంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
- డయాబెటిస్ ఉన్నవారు బెల్లం ఎక్కువగా తింటే అది కిడ్నీలపై ఒత్తిడిని పెంచి దీర్ఘకాలికంగా సమస్యలను పెంచొచ్చు.
- బెల్లంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిలో పొటాషియం స్థాయిలు పెరిగితే అది హానికరం కావచ్చు.
లిమిటెడ్ గా తీసుకోవడం
ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటే మంచిది. రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోవడం సాధారణంగా సురక్షితం. అయితే డయాబెటిస్ ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించాకే దీన్ని తీసుకోవడం మంచిది.
నకిలీ బెల్లం
కొన్ని చోట్ల రసాయనాల ద్వారా తయారైన లేదా కల్తీ చేసిన బెల్లాన్ని విక్రయిస్తున్నారు. ఆక్సిటోసిన్, సోడియం బైసల్ఫైట్ వంటి రసాయనాలను ఉపయోగించి తక్కువ నాణ్యత కలిగిన బెల్లం తయారు చేయడం జరుగుతోంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి నాణ్యమైన సహజంగా తయారైన బెల్లాన్ని మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)