నవతెలంగాణ- హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విష్ణు ప్రియ, యాంకర్ శ్యామల, రితూ చౌదరి లాంటి యాక్టర్స్ తో పాటు మరి కొంతమందిపై పంజాగుట్ట పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో మియాపూర్ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్ లపై మియాపూర్ పోలీసులు బుధవారం రోజు కేసులు నమోదు చేశారు. వారిపై ఎఫ్ఎఆర్ నెంబర్ 393/2025 కింద కేసులు నమోదు కాగా సెక్షన్లు 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3,3(ఏ) 4, టీఎస్ జీఏ, 66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.