ABN
, Publish Date – May 02 , 2025 | 07:55 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కులగణన మరియు జనగణన ప్రక్రియ తర్వాత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): కులగణన ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. జన గణనతో పాటు కుల గణన చేపట్టినంత మాత్రాన బీసీలకు రిజర్వేషన్లు దక్కవని, అందుకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన శ్రీనివా్‌సగౌడ్.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష పార్టీలు, బీసీ ఉద్యమ నేతలను తీసుకుని ప్రధాని మోదీని కలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీనివా్‌సగౌడ్ విలేకరులతో మాట్లాడారు. కుల గణన నిర్ణయంతో తాము పాక్షిక విజయం సాధించామని.. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచినపుడే బీసీ ఉద్యమానికి సంపూర్ణ విజయం సాధించినట్లు అవుతుందన్నారు. కులగణన ఉద్యమానికి విజయ సంకేతంగా ఈ నెల 6న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
Updated Date – May 02 , 2025 | 07:56 AM