బీజాపూర్‌లో 50మంది మావోయిస్టుల లొంగుబాటు

Written by RAJU

Published on:

బీజాపూర్‌లో 50మంది మావోయిస్టుల లొంగుబాటు– వారిపై రూ.68 లక్షల వరకు రివార్డు
– ప్రభుత్వ విధానం, భద్రతా దళాల వ్యూహమే ప్రధాన కారణమన్న ఎస్పీ
నవతెలంగాణ-చర్ల
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, రోడ్డు నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై రూ.68 లక్షల రివార్డు గల 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రివార్డు పొందిన 13 మంది మావోయిస్టులతో సహా 50 మంది ఆయుధాలను వదిలారని బీజాపూ ర్‌ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపారు. ప్రభుత్వ విధానం, భద్రతా దళాల వ్యూహం ప్రభావంతోనే మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టి సమాజ స్రవంతిలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. లొంగిపోయిన వారిలో నెంబర్‌ 1, 2, 7 పీఎల్‌జీఏ బెటాలియన్‌, నేషనల్‌ పార్క్‌ ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు ఏరియా కమిటీ స్థాయి సభ్యులు, జనతా సర్కార్‌ అధ్యక్షులు, కేఏఎంఎస్‌ అధ్యక్షులు, సీఎన్‌ఎం సీఎన్‌ఎం సభ్యులు, మిలిషియా కమాండర్‌, మిలిషియా ప్లాటూన్‌ సభ్యుడు అనేక ఇతర మావోయిస్టు క్యాడర్లు ఉన్నారు. వీరిలో 13 మందిపై మొత్తం రూ.68 లక్షల రివార్డు ఉన్నట్టు తెలిపారు. ఆరుగురిలో ఒకొక్కరిపై రూ.8లక్షలు, ముగ్గురికి రూ.5లక్షలు, మిగిలిన నలుగురిపై ఒకొక్కరికి రూ.లక్ష రివార్డు ఉంది. వీరి లొంగుబాటులో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కీలకపాత్ర పోషించాయని అన్నారు. కాగా, మావోయిస్టుల సంస్థలో కొనసాగుతున్న అరాచకాలు, పెరుగుతున్న అంతర్గత విభేదాలు, భావజాలం పట్ల భ్రమలు, సురక్షితమైన కుటుంబ జీవితాన్ని గడపాలనే కోరిక లొంగిపోవడానికి ప్రధాన కారణాలని వారు పేర్కొన్నట్టు ఎస్పీ తెలిపారు. ఇది కాకుండా ఛత్తీస్‌గఢ్‌ ప్రభు త్వం పునరావాస విధానం, భద్రతా బలగాల కఠినమైన చర్యలు, ఈ ప్రాంతం లో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా మావోయిస్టులు లొంగిపోవడానికి ప్రేరేపించాయని అన్నారు. అంతర్గత ప్రాంతాల్లో భద్రతా శిబిరాల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, నీరు, విద్యుత్‌ లభ్యత, మెరుగైన రవాణా, ప్రభుత్వ ప్రజా సంక్షే మ పథకాల వల్ల మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో మార్పులు కనిపిస్తు న్నాయి. గ్రామస్తులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన సానుకూల సంభా షణ మావోయిస్టులను లొంగిపోయేలా చేసిందని ఎస్పీ వివరించారు.

Subscribe for notification
Verified by MonsterInsights