‘బిల్లా రంగ బాషా’ షూటింగ్‌ ప్రారంభం

Written by RAJU

Published on:

‘బిల్లా రంగ బాషా’ షూటింగ్‌ ప్రారంభంభారతీయ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కొత్త శకానికి నాంది పలుకుతూ ‘బిల్లా రంగ బాషా’ షూటింగ్‌ బుధవారం ప్రారంభమైందని మేకర్స్‌ తెలిపారు. కిచ్చా సుదీప్‌ హీరోగా, అనుప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2209 ఎడి ఫ్యూచర్‌లో సెట్‌ చేయబడిన, ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించ నుంది. గ్రాండ్‌ స్కేల్‌లో ఈ సినిమా భారతీయ సినిమా రంగం నుంచి సైన్స్‌ ఫిక్షన్‌ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్‌ జర్నీని సూచిస్తోంది. బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘హనుమాన్‌’ మేకర్స్‌ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్‌ పవర్‌, టెక్నికల్‌ వాల్యూస్‌లో ఈ సినిమా న్యూ బెంచ్‌ మార్క్‌ని క్రియేట్‌ చేయనుంది. కాన్సెప్ట్‌ వీడియో, లోగో రివీల్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత ఈ గ్రేట్‌ విజన్‌ని స్క్రీన్‌ పైకి తీసుకురావడానికి టీం సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని ఎగ్జైటింగ్‌ అప్డేట్స్‌ మేకర్స్‌ త్వరలో తెలియజేయనున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights