బిర్యానీ తిని మంచిగానే డబ్బులిచ్చారు.. కానీ బుక్కయ్యారు.. ట్విస్ట్ ఏంటంటే..?

Written by RAJU

Published on:


బిర్యానీ తిని మంచిగానే డబ్బులిచ్చారు.. కానీ బుక్కయ్యారు.. ట్విస్ట్ ఏంటంటే..?

గురువారం కర్నాటక రాయచూర్‌ నగరంలోని ఒక బిర్యానీ హోటల్‌లో నకిలీ రూ.500 నోటుతో డబ్బు చెల్లించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు. అరెస్టయిన నిందితులను మంజునాథ్, రమేష్‌లుగా గుర్తించారు. స్థానికంగా ఉన్న ఒక హోటల్‌లో చికెన్ బిర్యానీ తిన్న అనంతరం నకిలీ కరెన్సీ ఇచ్చి బిల్లు చెల్లించడానికి ప్రయత్నించారు. అయితే వారిచ్చిన నోటుపై హోటల్ యజమానికి అనుమానం వచ్చింది. దీంతో తీక్షణంగా పరిశీలించగా, దానిపై “చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” అని రాసి ఉంది. దీంతో ఆ నోటు నకిలీదని హోటల్ యజమాని నిర్ధారించుకుని.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.

స్థానిక మార్కెట్ యార్డ్ పోలీసులు స్పాట్‌కు వచ్చి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆపై న్యాయమూర్తి ఆదేశాలతో వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కాగా నకిలీ కరెన్సీ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో రాయచూర్‌‌లో ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Subscribe for notification