బాసరలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు | Ancient Sculptures Discovered at Basara Saraswati Temple in Nirmal District

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 15 , 2025 | 05:16 AM

నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వెయ్యేళ్ల నాటి పురాతన శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. శుక్రవారం బాసర పుణ్యక్షేత్రంలో వారు పర్యటించి పురాతన ఆలయాలను సందర్శించారు.

బాసరలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

బాసర, మార్చి 14(ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వెయ్యేళ్ల నాటి పురాతన శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. శుక్రవారం బాసర పుణ్యక్షేత్రంలో వారు పర్యటించి పురాతన ఆలయాలను సందర్శించారు. ఆలయాల వద్ద ఉన్న శిల్పాలను పరిశీలించగా.. అవి ప్రాచీన కాలం నాటి శిల్పాలని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, బాసర నివాసి బలగం రామ్‌మోహన్‌ ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈ. శివనాగి రెడ్డి బాసరలో పర్యటించారు.

చారిత్రక ఆనవాళ్లు, శిథిల ఆలయాలు, శాసనాలను పరిశీలించారు. ఆంజనేయ స్వామి ఆలయం ముందు క్రీస్తు శకం 11వ శతాబ్ధంలో జైన శాసనాన్ని, గణేశాలయంలో క్రీస్తు శకం 8వ శతాబ్ధం నాటి 5 అడుగుల ఎత్తు గల చాళుక్య గణేశ శిల్పం చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉందని పురావస్తు పరిశోధకులు తెలిపారు. పాపహరేశ్వర ఆలయం ముందున్న క్రీస్తు శకం 9, 12 శతాబ్ధాలకు చెందిన జైన యక్షిణి, భైరవ, శివలింగం, నంది, గణేశ, సతి శిలలు, దాన శాసనాలతో పాటు శిలా తోరణాలను గుర్తించారు.

Updated Date – Mar 15 , 2025 | 05:16 AM

Google News

Subscribe for notification