బాబోయ్ ఆ గ్రామాలకు ఇదేం శాపం.. అప్పుడు జుట్టు రాలింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్.. భయం గుప్పిట్లో..

Written by RAJU

Published on:


బాబోయ్ ఆ గ్రామాలకు ఇదేం శాపం.. అప్పుడు జుట్టు రాలింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్.. భయం గుప్పిట్లో..

ఆ గ్రామాలకేమైంది..? అప్పుడు జుట్టు రాలిపోయింది..! ఇప్పుడు గోళ్లు కూడా ఊడిపోతున్నాయి..! అసలేం జరుగుతోంది..? గుబురుగా ఉన్న జుట్టు కాస్తా ఉన్నట్టుండి కుప్పలు కుప్పలుగా రాలిపోవడమేంటి..? పొడవాటి గోళ్లు పుట్టుక్కున ఊడిపోవడమేంటి..? ఇప్పుడిదే మిస్టరీగా ఉంది. డాక్టర్లకు సైతం సవాల్‌ విసురుతోంది. అసలింతకీ సమస్య ఎక్కడంటారా..!  అయితే.. ఈ కథనంలో తెలుసుకోండి.. మహారాష్ట్ర బుల్ఢాణా జిల్లాలో కొన్ని గ్రామాలను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. శరీరంలో ఎప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుందో తెలిక బెంబేలెత్తిపోతున్నారు జనాలు. మొన్న ఉన్నట్టుంది వందలాది మందికి ఆకస్మాత్తుగా జుట్టు ఊడిపోయిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ప్రజలంతా గోళ్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కలవరపెడుతోంది..

బుల్ఢాణా జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజలు గోళ్లు ముడతలు పడటం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల దగ్గర్నంచి ముసలివాళ్ల వరకు ఎంతో మంది ఈ గోళ్ల సంబంధిత సమస్యలతో కొన్నిరోజులుగా అవస్థలు పడుతున్నారు. ఏం జరుగుతోందో… ఎందుకు జరుగుతుందో తెలియక ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన డాక్టర్లు… అందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో తెలిసుకునే పనిలో ఫుల్‌ బిజీ అయిపోయారు. అయితే శరీరంలో సెలీనియం లెవల్స్ పెరగడమే ఈ సమస్యకు కారణంగా భావిస్తున్నారు అక్కడి వైద్యులు.

కొన్ని రోజులు క్రితం ఇవే గ్రామాలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఇక్కడి ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటివరకు ఒత్తుగా ఉన్న జట్టు ఒక్కసారిగా రాలిపోవడంతో ప్రజలంతా ఖంగుతిన్నారు. సిగ్గుతో బయటకు కూడా వెళ్లలేకపోయారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరిది ఇదే సమస్య. యువత ఉద్యోగాలు, కాలేజీలకు వెళ్లడం మానేసి.. ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే సెలీనియం లెవల్స్‌ పెరగడమే జుట్టు ఊడిపోవడానికి కారణమని తేల్చారు వైద్యులు.

ఇక మహారాష్ట్ర దిగుమతి చేసుకునే వాటిలో స్థానికంగా పండించిన గోధుమ కంటే 600 రెట్లు ఎక్కువ సెలీనియం ఉందని తేల్చారు వైద్యులు. దీనికి తోడు జింక్‌ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో జుట్టు అధికంగా రాలడానికి ఇదే కారణమని పరీక్షల అనంతరం క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా సెలీనియం ఎఫెక్ట్‌తోనే ఈ గోర్లు ఊడిపోవడం జరుగుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలొచ్చాక అసలు విషయం చెబుతామంటున్నారు. మరి చూడాలి ఏం తేలుస్తారో…! ఎలాంటి సొల్యూషన్‌ చెబుతారో…!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights