బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. –

Written by RAJU

Published on:

నవతెలంగాణ –  కామారెడ్డి

బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 5, 1908 లో బీహార్ రాష్ట్రం లోని భోకపూర్ జిల్లా చంద్వా గ్రామంలో శోభి రామ్ వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని తెలిపారు. ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని, క్విట్ ఇండియా పోరాటం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. 1952 – 56 సంవత్సరంలో సమాచార మంత్రిత్వ శాఖ, 1956 – 62 లో రైల్వే మంత్రిత్వ శాఖ, 1962 – 63 లో రవాణా, కమ్యూనికేషన్ శాఖలు నిర్వహించారని తెలిపారు. 1967 – 70 కాలంలో గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు. 40 సంవత్సరాలు పార్లమెంట్రియన్ గా, 10 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు రాజీవ్ యువ వికాసం క్రింద యువత, అర్హులైన వారు యూనిట్ల స్థాపనకు ఈ నెల 14 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గత నాలుగు నేలల క్రితం ప్రభుత్వం వసతి గృహాల మేనూ 40 శాతం.పెంచిందని, తద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందజేయడం జరుగుతున్నదన్నారు.   ప్రతి ఇన్స్టిట్యూట్ కు ఒక అధికారిని నియమించడం జరిగిందని, విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించి నివేదికలు సమర్పించడం జరుగుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుచున్నదని, జిల్లాలో 60 శాతం పంపిణీ జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఎంపీ గా, ఉప ప్రధానిగా పనిచేశారని, రాజకీయంగా ఉన్నతిదయ్యాడని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బడా నేతలు అగ్రవర్ణాల నేతలే పాలిస్తున్నారని ఇప్పటికీ సమాజంలో మార్పు రాలేదని, మనం మేకలుగా ఉంటే మనల్ని తినేయడానికి ఆ నాయకులు చూస్తారని మనం పులులుగా బతికిన రోజే అందరు భయపడతారని బాబాసాహెబ్ ఆ రోజుల్లోనే అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం వేసవిలో నేటికీ అర్జున వాడల్లో దళితులు నీటి కోసం కష్టపడుతున్నారని అర్జునవాడలపై కలకడ దుస్థితి సారించాలని సందర్భంగా ఆయన కలెక్టర్ ను కోరారు. అంతకుముందు పలువురు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఇలాంటి మహా నాయకుల జయంతులకు ప్రతి గురుకుల, వసతి గృహాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆ మహా నాయకుల గురించి వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రానస్ మాస్టర్ సాయి మౌర్య జై భారత్ జై భీమ్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి కార్యక్రమం పలువురుని అలరించింది.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, ఆర్డీఓ వీణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, దళిత నాయకుడు సంపత్, బివిఎం విటల్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి, నాయకులు నరేందర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతిలో మహిళా నాయకురాలకు స్థానం లేదా ?

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా దళిత మహిళల్లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు ఆ ఒకరిద్రిని కూడా బాబు జగ్జీవన్ రావ్ జయంతి రోజు అధికారులు గుర్తించకపోవడం అధికారులకు సమాజం పట్ల, నాయకుల పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి హాజరైనా ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు సత్తిగరి లక్ష్మినీ కార్యక్రమం ప్రారంభమైన 20 నిమిషాలకు స్టేజి మీదకి పిలవడం ఎక్కడో వెనకాల కూర్చోబెట్టారు. మహిళలకు ఇలాంటి కార్యక్రమాలలో గౌరవాన్ని ఇస్తే మహిళలు తాము స్వచ్ఛందంగా మరింత మంది రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కూడా ఈ అవకాశాన్ని ఈ నాయకులు, అధికారులు ఇచ్చే ఆలోచనలో లేనట్లు ఈ కార్యక్రమంలో స్పష్టమైంది. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు మహిళలకు సరైన ప్రాతినిచమిచ్చి వారిని రాజకీయంగా ముందుకు నడిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

Subscribe for notification
Verified by MonsterInsights