బడ్జెట్‌పై ఆశలు..

Written by RAJU

Published on:

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్ట నున్న బడ్జెట్‌పై జిల్లా రైతాంగం ఆశలు పెంచుకున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు భూములకు సాగు నీటిని అందిస్తా మని, మంథని మండలంలో ప్రతిపాదిత పోతారం ఎత్తి పోతల పథకాన్ని చేపడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రాథమి కంగా నీటి పారుదల శాఖాధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. నవంబర్‌ 24న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌లతో కలిసి ధర్మారం మండలం పత్తిపాకలో గల ప్రతిపాదిత రిజర్వాయర్‌ స్థలాన్ని పరిశీలించారు. 5 నుంచి 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావిస్తు న్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి దాదాపు 1500 ఎకరాల భూములు ముంపునకు గురి కానున్నాయని అంచనా వేశారు. ఇందులో 400 ఎకరాలు అటవీ భూమి కాగా మిగతా భూమి రైతుల నుంచి సేకరిం చాల్సి ఉంటుందని, 2,400 కోట్ల రూపాయల వరకు వ్యయం కానున్నదని అంచనా వేశారు. ఈ రిజర్వా యర్‌ను నిర్మించి తీరతామని డిసెంబర్‌ 4న జిల్లాలో జరిగిన సీఎం యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా హామీ ఇచ్చారు.

ఫ 2.40 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు

జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియో జకవర్గాల్లో గల ఎస్సారెస్పీ లక్షా 80 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లోని 40 వేల ఎకరాలతో పాటు 10 నుంచి 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందనున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రతీ సీజన్‌లో సాగు నీటిని వారబంధి పద్ధతిన విడుదల చేస్తున్నారు. కాలువ చివరి భూములైన ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, రామగిరి, మంథని, రామ గుండం మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పత్తిపాక వద్ద 5 నుంచి 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించినట్లయితే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా చొప్పదండి మండలం రేవెల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద గల ఎస్సారెస్పీ కాలువకు లింక్‌ చేస్తే చివరి ఆయ కట్టుకు సాగు నీరు అందనున్నదని ప్రతిపాదించారు. అయితే గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. ఈ రిజర్వాయర్‌ను నిర్మించాలని మంత్రితోపాటు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు.

ఫ పోతారం ఎత్తిపోతలతో 30 వేల ఎకరాలు..

మంథని నియోజకవర్గ పరిధిలోని మంథని, కమాన్‌ పూర్‌, రామగిరి, ముత్తారం మండలాల్లోని 22 వేల ఎక రాల ఎస్సారెస్పీ ఆయకట్టు భూముల స్థిరీకరణతో పాటు కొత్తగా 8 వేల ఎకరాల భూములకు సాగునీటిని అందించే విధంగా పోతారం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లో కూడా చేర్చారు. సుందిళ్ల బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మా ణానికి 400 కోట్ల రూపాయల వరకు వ్యయం అవు తుందని అంచనా వేసినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. గోదావరి అవతలి పక్కన చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎన్నికల సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు సైతం పోతారం పథకాన్ని చేపడతామని హామీ ఇవ్వ డంతోపాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వస్తున్నారు. ఆ మేరకు ఈ బడ్జెట్‌లో పోతారం ఎత్తిపోతల పథకాన్ని నిధులు కేటాయించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Subscribe for notification