బంధాల గ్రామంలో ఘనంగా బొడ్రాయి వేడుకలు 

Written by RAJU

Published on:

నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని బంధాల గ్రామపంచాయతీలో బొడ్రాయి వేడుకలు గత సోమవారం 28 నుండి (రెండు) రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సోమవారం యాగశాల అలంకరణ, నాలుగు దిక్కుల తోరణాలు నిర్మాణం. జ్యోతి ప్రజ్వలన, విగ్నేశ్వర పుణ్యాహవాచనం ప్రసాదాలు కర్పూర హారతి కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు మంగళవారం సుప్రభాత సేవ, నిత్య పూజ కార్యక్రమాలు, నిత్య అగ్ని హోమాలు, జలాదిస్నానాలు, మంగళ హారతి ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నేడు 30 బుధవారం హోమాలు, వసంతోత్సవం అష్టదిగ్బంధనం, ఊరడి (బలి పూజా) కార్యక్రమాలు నిర్వహించారు.  ఒకటవ తారీకు గురువారం నాడు గ్రామ ఆడపడుచులకు అమ్మవారి బోనాలు సమర్పించుట నైవేద్యం ముడుపులు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అష్టదిగ్బంధనం బలి తిరుగుట కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. గ్రామంలోని వారు బయటకు పోకూడదు బయటివారు లోనికి రాకూడదు అని తెలిపారు. బొడ్రాయి ఉదయమే పేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ బొడ్రాయిని ప్రతిష్టించారు. గ్రామ పెద్దల సమక్షంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ‌ అగ్ని ప్రతిష్టాపన, హోమం, బొడ్రాయి ఊరేగింపు అభిషేకం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతి తో ఊరేగింపుగా వెళ్లి గ్రామంలో ప్రతిష్టించిన బొడ్రాయి దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, విగ్రహ దాత ఆగబోయిన రామయ్య, పటేల్ నాలి రామయ్య, దొర ఆకపోయిన సమ్మయ్య, పెద్దమనిషి చింత బుచ్చయ్య, గ్రామస్తులు ఆగబోయిన సమ్మయ్య పోదాం నరసయ్య, మహిళలు కురుసం పుల్లక్క నాలి నాగక, యూత్ అధ్యక్షులు చింత రమేష్, కార్యదర్శి నాలి సాంబశివరావు, గ్రామస్తులు, మహిళలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

– Advertisement –

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights