
పెట్రోల్ బంకులో కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. వినియోగదారులకు చాలా సేవలు బంకు యాజమాన్యాలు కల్పించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వాటిపై వినియోగదారులకు ఎలాంటి అవగాహన లేకపోవడముతో బంకు యజమానులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చాలామందికి పెట్రోల్ బంకుల్లో కల్పించే మౌలిక సదు పాయాల గురించి చాలా మందికి అవగాహన లేదు. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించినా, లేకపోయినా ఈ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత బంకు యజమన్యనిదే. బంకుల్లో సౌకర్యాలు కల్పించకుంటే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు కూడా చేయొచ్చు. బంకు లో ప్రథమ చికిత్స కిట్ తప్పనిసరిగా ఉండాలి. ప్రధమ చికిత్స కిట్ లోని వైద్య పరికరాలను, ఔషధాలను ఎప్పటికప్పుడు మార్చాలి.
దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలా ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉండదు. ఇక ఎండాకాలంలో అయితే చెప్పనవసరం లేదు. బంకులో తాగునీరు అందించాల్సిన బాధ్యత బంకు వాళ్ళదే. మరుగు దొడ్లు లేక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అన్ని బంకుల్లో శుభ్రతమైన మూత్రశాలలు, మరుగు దొడ్లు కూడా ఉండాలి. అత్యవసర సముయాల్లో ఫోన్ చేసుకునేందుకు సదుపాయం కూడా ఉండాలి. వాహనాల టైర్లలో గాలి నింపడానికి తనిఖీ చేసుకోవడా పెట్రోల్ బంకులో తప్పనిసరిగా ఎయిర్ మెషీన్ ఉండాలి. వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపాలి. ఫిర్యాదుల బాక్స్ అందుబాటులో ఉంచాలి. పెట్రోల్, డీజిల్ నాణ్యతపై అనుమానం ఉంటే అక్కడే తనిఖీ చేసుకోవచ్చు.
ఇందుకు కావాల్సిన పరికరాలు కూడా అందుబాటులో ఉంచాలి. ఇందులో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా వినియోగదారుల ఫిర్యాదు వేయొచ్చు. బంకుల్లో సరదుపాయాలు సరిగా లేకపోయినా బంకు సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా వినియోగ దారులు ఫిర్యాదు చేయవచ్చు. చిరునామాతో, ఇతర సమాచారం ఇస్తే.. సంబంధిత చమురు సంస్థ వారిపై చర్యలు తీసుకుంటంది. ఫిర్యాదు చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు.. ఇండియన్ ఆయిల్: 1800233355, భారత్ పెట్రోలియం: 1800224344, హెచ్పీసీఎల్: 18002333555, రిలయన్స్: 18008919023.