– తగ్గిన చీడ పురుగుల బెడద
– జిల్లాలో 33,841 ఎకరాల్లో మామిడి తోటలు
– బాట సింగారం బాట పట్టిన కొల్లాపూర్ రైతులు
– ప్రతీ రోజు దాదాపు 300 టన్నుల తరలింపు
– టన్ను మామిడికి రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలు పలుకుతున్న ధర
– క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద సబ్సిడీ ద్వారా 12 లక్షల ఫ్రూట్ కవర్లు పంపిణీ
కొల్లాపూర్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోనే కొల్లాపూర్ మామిడికి డిమాండ్ ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నాణ్యమైన దిగుబడి వస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో కోటి ఫ్రూట్ కవర్లతో 24వేల 800 ఎకరాల్లో మామిడి పంటను రక్షించుకున్నారు. గత ఏడాది కన్నా నాణ్యమైన దిగుబడి సాధించేందుకు ఫ్రూట్ కవర్లు ఎంతో ఉపయోగపడ్డాయని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నా రు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కొల్లా పూర్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో 33వేల 841 ఎకరాల్లో మామిడి సాగుచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రతీ రోజు 300 టన్నుల మామిడిని హైదరాబాద్‌లోని బాట సింగారం ఫ్రూట్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మంచి కాయ సైజు, రంగు ఉన్న టన్ను మామిడి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ధర పలుకుతోందని రైతులు చెబు తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడా ది అధిక ధర పలుకుతోందని రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సీడీపీక్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద మామిడి రైతులకు 50 శాతం సబ్సిడీలో ఫ్రూట్ కవర్లు అందించారు. జిల్లా వ్యాప్తంగా 12 లక్షల ఫ్రూట్ కవర్లను పం పిణీ చేస్తే అందు లో కొల్లాపూర్ ని యోజకవర్గంలోనే 11 లక్షల కవర్లు అంద జేశారు. ప్రైవేటులో దాదాపు 80 లక్షల ఫ్రూట్ కవర్లు కొల్లాపూర్ నియోజకవర్గ మామిడి రైతులు కొనుగోలు చేసినట్లు ఉద్యానవనశాఖ అధికారుల ద్వారా తెలిసిం ది. ప్రైవేటులో ఒక్క కవరు ధర రూ.2.50 పైసల చొప్పున కొనుగోలు చేశారు.
మార్కెట్ అందుబాటులో లేక అవస్థలు
మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వపరం గా మామిడి కొనుగోలు కేంద్రం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరు నెలల పాటు కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు హైదరాబాద్ లాం టి మార్కెట్‌కు పంటను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల ఛా ర్జీలు, అధిక కమిషన్లు, జీఎస్టీ పేరుతో హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్లో వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని, అడిగే వారే లేరని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల కష్టాలు తీరుస్తామన్న పాలకుల హామీ నేటికీ తీరని కలగానే మిగిలిందని వాపో తున్నారు.
Updated Date – Mar 20 , 2025 | 11:30 PM