న్యూ ఛాప్టర్
‘‘మా ప్రేమ కథ న్యూ ఛాప్టర్ తో కంటిన్యూ అవుతుందని’’ వినేశ్, సోమ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. చిన్నారి పాదం ఎమోజీ, గుండె చిహ్నంతో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి రెజ్లింగ్ పైనే ప్రాణం పెట్టి సాగిన వినేశ్ ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేసింది. దేశానికి పతకాలు సాధించి పెట్టింది. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాలు ముద్దాడింది. కానీ ఒలింపిక్ మెడల్ కల మాత్రం కలగానే మిగిలిపోయింది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె అనూహ్యంగా పతకానికి దూరమైంది.