‘హిట్’ సిరీస్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ..’ ఈనెల 24న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ట్రాక్ నాని, శ్రీనిధి శెట్టి మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేయనుంది. ఇది అభిమానులకు సినిమా ఇంటెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నెరేటివ్‌కి రిఫ్రెషింగ్‌ని అందిస్తుంది. అలాగే ఈ ఫస్ట్ సింగిల్ బ్యూటీఫుల్ మెలోడీగా ఉండనుంది. మిక్కీజెమేయర్ కంపో జిషన్ శ్రోతలను మంత్రముగ్దుల్ని చేయనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత విజయవంతమైన ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడవ భాగం. టీజర్, పోస్టర్‌లు సినిమాపై భారీ బజ్‌ని క్రియేట్ చేశాయి. వాల్ పోస్టర్ సినిమా, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

‘ప్రేమ వెల్లువ..’తో పాటల సందడి షురూ
Written by RAJU
Published on: