-
కొనుగోలు చేసి కారుకు అంటించుకున్న నిందితులు
-
ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగం కేసులో ఇద్దరి అరెస్ట్
పంజాగుట్ట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ కారు పాస్ స్టిక్కర్ దుర్వినియోగం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. నకిలీ స్టిక్కర్లను ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కొనుగోలు చేశామని నిందితులు వెల్లడించినట్లు సమాచారం. ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కారు పాస్ స్టిక్కర్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ మంత్రి పీఆర్‌వో పాండునాయక్ ఈ నెల 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరుకు చెందిన కృష్ణ యాదవ్, భాను ప్రసాద్ యాదవ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఈ స్టిక్కర్లను ముద్రించి, రూ.3-10వేలకు అమ్ముతున్నట్లు వారు తెలి పారు. టోల్‌ప్లాజాల వద్ద డబ్బు చెల్లించకుండా వెళ్లేందుకు ఆ స్టిక్కర్లను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీ సులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.