ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Written by RAJU

Published on:

ప్రభుత్వానికి కృతజ్ఞతలుకళాకారులను, సాంకేతిక నిపుణులను తద్వారా చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంతిరెడ్డికి తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కృతజ్ఞతలు తెలిపింది. 2024 ఏడాదిగాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, గొప్ప వ్యక్తుల (1) ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు (2) పైడి జైరాజ్‌ చలనచిత్ర అవార్డు (3) బి.ఎన్‌. రెడ్డి చలనచిత్ర అవార్డు (4) నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు (5) కాంతారావు చలనచిత్ర అవార్డు (6) రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు… పేర్లు మీద ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ను ప్రదానం చేయటం అభినందనీయం. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, టిఎఫ్‌డీసి చైర్మన్‌ వి.వెంకటరమణ రెడ్డి (దిల్రాజు)కి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హదయపూర్వక కతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను పునరు ద్ధరించడం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇది తెలంగాణలో చలనచిత్ర నిర్మాణాన్ని మరింతగా ప్రోత్సహిస్తుంది అని టీఎఫ్‌పీసీ కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ అన్నారు.

Subscribe for notification