– పోలీస్ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి
– నెలవారీ సమీక్షలో ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ మెరుగైన సేవలు అందించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతాయు తంగా పనిచేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అ న్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ అధికా రులతో ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, రాజేందర్‌రెడ్డి, రామ్‌లాల్, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, విజయ్, రమేష్, రాము, భాగ్యలక్ష్మీరెడ్డి, నవీద్, కృష్ణం రాజు, సునిత తదితరులున్నారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 47 ఫోన్ల రికవరీ
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సీఈఐఆర్ వెబ్‌పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. బుధవారం ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో గత రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 47 ఫోన్లను కనిపెట్టి తిరిగి వారికి ఎస్పీ అందించి, మాట్లాడారు. నూతన టెక్నాలజీతోఫోన్లు రికవరీ చేసిన ఐటీ కోర్ కానిస్టేబుల్ రమేష్‌ను ఎస్పీ అభినందించారు. డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, రాజేందర్ రెడ్డి, రామ్‌లాల్, సైదులు తదితరులున్నారు. న్నారు.
Updated Date – Mar 19 , 2025 | 11:11 PM