
అంతేకాదు క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు కూడా పోట్లకాయలో పుష్కలంగా ఉన్నాయట. పొట్లకాయలను తరచుగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తదితర సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి పొట్లకాయ ఉపశమనం కలిగిస్తుందట. జ్వరం వచ్చినా, కామెర్లు సోకినా పొట్లకాయను తినడం వల్ల త్వరగా కోలుకుంటారట. పొట్లకాయలను ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెర్లు త్వరగా నయం అవుతాయట. పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దడం వల్ల జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుందట. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుందట. ఇందులో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం, అలసట దరిచేరవు. వీటిలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనాలు శరీర రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. గుండె దడ, ఛాతి నొప్పి, హైబీపీ, ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజూ 30 ఎంఎల్ మోతాదులో పొట్లకాయ రసం తాగితే గుండె పనితీరు మెరుగుపడుతుందన్నది నిపుణుల మాట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 ఏళ్ల చరిత్ర ఉన్న రజినీ థియేటర్ ఇక నేల మట్టం
చైతన్య కంటే ముందే శోభితకు లవ్ స్టోరీ! తెలిస్తే షాకవడం పక్కా..
అభిమానిని లాగిపెట్టి కొట్టిన స్టార్ హీరోయిన్
శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?
నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!