
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని సీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన రూ.31,91,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఆయన వెంట కూడవెళ్లి ఆలయ చైర్మన్ ఉషయ్యగారి రాజిరెడ్డి,పీఏసీఎస్ డైరెక్టర్ గజభీంకార్ బాలరాజు,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్,దుబ్బాక మున్సిపల్,మండల అధ్యక్షులు ఏసురెడ్డి,కొంగర రవి,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి,ఆకుల భరత్ పలువురున్నారు.