– 449 సర్వే నెంలో సాగులో ఉన్న పేదలకు పట్టా పాస్ పుస్తకాలివ్వాలి : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ – మరికల్
పేదల కోసం మరిన్ని భూ పోరాటాలు చేద్దామని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మరికల్‌లోని సూర్యచంద్ర ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి సమా వేశం ఆదివారం రెండవ రోజూ కొన సాగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పేదల భూములను బలవం తంగా లాక్కొని బడా కార్పొరేట్లకు అప్పజెప్తున్నాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టా నికి రూ.2 లక్షల కోట్లు కేటాయిం చాల్సి ఉండగా కేవలం రూ.86 వేలకోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. ప్రతేడాది ఇలా బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ ఉపాధి చట్టాన్ని నిర్వీ ర్యంచేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు భూ భారతిలో మరికల్ గ్రామంలోని ప్రభుత్వ భూమి 449 సర్వేనెంబర్‌లో సాగు చేస్తున్న పేద లకు భూ భూరతిలో ఎంట్రీ చేసి పట్టాలిచ్చి ప్రభుత్వ పథకాలు అమల య్యేలా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు.. సంఘం అధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలు, అనుభవాలను వివరించారు. భవిష్యత్ కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో వ్యకాస జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలప్ప, గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్, మరికల్ భూ పోరాట కమిటీ నాయకులు ఆర్. బీమ్ రాజు, బి. మల్లయ్య, జి. గోవర్ధన్, జి. సుదర్శన్, జి. వెంకటేష్, లక్ష్మమ్మ, రాములు, లక్ష్మయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

పేదల కోసం మరిన్ని భూపోరాటాలు చేద్దాం

Written by RAJU
Published on: