పూలే ఆశయాలను కొనసాగించాలి | Phule ought to proceed his ambitions.

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 12 , 2025 | 12:12 AM

సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజ నుల ఆభివృద్ధికి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, దార్శనీకుడు మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా గల పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.

 పూలే ఆశయాలను కొనసాగించాలి

కరీంనగర్‌,ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతిప్రతినిధి): సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజ నుల ఆభివృద్ధికి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, దార్శనీకుడు మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా గల పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, అడిషనల్‌ కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌ సహా పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో మానకొం డూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే వంటి సంఘసంస్కర్తల కృషివల్లే నేటి సమాజం చైతన్యవంతంగా ఉందని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టిందని, బీసీల రిజర్వేషన్‌ కోసం చర్యలు తీసుకున్నదని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ ముందు గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద చౌరస్తాను అభివృద్ధి చేస్తామని, ఇందుకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ బహుజనులకు చదువే అభివృద్ధి మార్గమని సూచించి ఆనాటి రోజుల్లో మహిళా చదువును ప్రోత్సహించిన గొప్ప సంఘసంస్కర్త మహా త్మజ్యోతిరావు పూలే అని అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేసిన రోజుల్లో తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించడంతో పాటు మహిళా పాఠశాలలను స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. భర్త మరణించిన స్త్రీలకు ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారు చదువు కునేలా ప్రోత్సహించారని, ఆడపిల్లల భ్రూణ హత్యలను నివారించాలని తెలిపారు. సమా జాభివృద్ధికి ఎంతో కష్టపడిన పూలే త్యాగాలు మరువలేనివని, ఆయన మార్గాన్ని ఆచరించాలని అన్నారు. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ ఆనాటి కాలంలో ప్రజలను చైతన్యం చేయడంలో పూలే కీలక పాత్ర పోషించారని అన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించడమే కాకుండా మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యేలా ప్రోత్సహించారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన పూలే స్ఫూర్తిని కొనసాగించాలని సూ చించారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కుల, మత, వర్ణ, లింగ భేదాలను రూపుమాపి అభివృద్ధికి చదివే మూలమని చాటి చెప్పిన మహనీయుడు పూలే అని అన్నారు. పూలే స్ఫూర్తిని, ఆశయాలను భావితరాలు కొనసాగించాలని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపూలే రాసిన పుస్తకాన్ని, తెలుగు, ఇంగ్లీష్‌ అనువాద పుస్తకా లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాష్‌, పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date – Apr 12 , 2025 | 12:12 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights