
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఉగాది శుభ సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తమ సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్ పై నిర్మించనున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాథ్ పవర్ ఫుల్ కథ రాశారు. ఇందులో విజరు సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. విజరు సేతుపతి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఆయన్ని డిఫరెంట్ అవతార్‌లో చూడబోతున్నారు. ఈ సినిమాపై ఎగ్జైట్‌మెంట్‌ని మరింత పెంచుతూ టబు ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. సెలెక్టెడ్ రోల్స్‌కి పాపులరైన టబు ఈ చిత్రంలోని పాత్ర, కథాంశం నచ్చి వెంటనే ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి అంగీకరించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సిబ్బందిని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.