పూత నిలవదు..పిందె కనిపించదు | The coating does not hold..the embryo is not visible.

Written by RAJU

Published on:

(ఆంధ్రజ్యోతి-రాజాపేట)

మామిడి సాగు ఐదు, ఆరేళ్లుగా ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ ఏడు కూడా నష్టాల బారిన పడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి, ఏళ్ల తరబడి శ్రమ కూర్చి పంటలను సాగు చేస్తున్నా వాతావరణంలో విభిన్న పరిస్థితులు ఎదురవ్వడంతో మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే మామిడికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి లేకపోవడంతో పూత పూసే సమయంలో ఈగుర్లు, కాచే సమయంలో పూత వస్తుంది.

రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ఉద్యాన పంటలపై దృష్టిని సారించారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతు లు మామిడి సాగు చేపట్టారు. దశేరి హిమాయత్‌ బంగినపల్లి, పునాస, చిన్నరసాలు, పెద్దరసాలు తదితర రకాలను సాగు చేశారు. జిల్లాలో 3,613 మంది రైతులు 11,333 వేల ఎకరాల్లో మామిడి సాగు చేశారు. బోర్లు, బావులు కింద అధికంగా సే ద్యం జరుగుతుంది. నవంబరు, డిసెంబరు వరకే పూత వచ్చి జనవరి చివరి కల్లా చిన్నపాటి పిందెలు ఏర్పడి మార్చి మొదటి వారం వరకు పావుకిలో సైజుకు పెరగాల్సి ఉంది. కానీ వాతావరణ ప్రభావంతో మార్చిలో సైతం మంచు కురుస్తుండడంతో పూత ఖాతా నిలవడం లేదు. మామిడి చెట్టుకు పిం దెలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. వాతావరణ ప్రభావంతో వివిధ తెగుళ్లు సోకుతున్నాయి. పూత పిందెను రక్షించేందు కు రైతులు విచ్చలవిడిగా మందులను స్ర్ఫే చేస్తున్నారు. ఇప్పటివరకు 5 నుంచి 6 సార్లు స్ర్ఫే చేసి రూ. వేలు వెచ్చిస్తున్నారు. అయినా మెరుగైన ప్రభావం కనిపించడం లేదు.

గత పదేళ్లుగా

గత పదేళ్లుగా మామిడి సాగు చేసే రైతులకు కాలం కలసిరావడం లేదు. వడగండ్లు, ఈదురుగాలులు, వాతావరణం అనుకూలించక తగ్గిన దిగుబడి, పండిన పంటకు రేటు లేకపోవడంతో ఏటా రైతులు నష్టాలపాలవుతున్నారు. ప్రధానంగా కరోనా నుంచి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి వ్యయం పెరుగుతున్నప్పటికీ పంట దిగుబడి రావడం లేదు. నష్టాలు తప్ప లాభాలు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. వడగండ్లకు పంటరాలి పోయిన అధికారులు సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిన ఇప్పటివరకు రూపాయి సా యం అందలేదని మామిడి రైతులు వాపోతున్నారు.

తోటలు కాపాడుకునేందుకు నానాపాట్లు

మామిడి తోటలపై వాతావరణం ప్రభావం చూపుతుండగా మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతులు తోటలను కాపాడుకునేందుకు నానాతనాంటాలు పడుతున్నారు. బోర్లు, బావులు నీరు అడుగంటడడంతో, ఎండలు తీవ్రమవుతుండడంతో మామిడి పూత, పిందె రాలిపోతున్నది. తోటలు ఎండిపోవడంతో తోటలను కాపాడుకునేందుకు రైతులు లక్షల రూపాయలు వెచ్చించి విచ్చలవిడిగా బోర్లను తవ్విస్తున్నారు. అయినప్పటికీ నీరు రాకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కౌలుకు తీసుకున్న.. దిగుబడి కష్టమే

పది ఎకరాలు మామిడి తోట కౌలుకు తీసుకున్నా. పూత, కాత సరిగ్గాలేదు. మం చు కురుస్తుండడంతో తోటలకు వివిధ తెగుళ్లు వస్తున్నాయి. రోగాల నుంచి రక్షిం చుకునేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టి మందులను స్ర్ఫే చేయాల్సి వస్తుంది. దిగుబడి కష్టంగానే మారింది.

– శక్తి వీరేశం కౌలు రైతు, బొందుగుల

మామిడి దిగుబడి అంతంతే

15 ఎకరాల్లో మామిడి సాగు చేశా. లక్ష రూపాయలు వెచ్చించా. ఐదారేళ్లుగా వాతావరణం అనుకూలించక పోవడంతో పంట దిగుబడి రావడం లేదు. వేసవిలో బావులు, బోర్లు ఎండిపోవడంతో తోటలను కాపాడుకోవడం కష్టంగా మారింది. ప్రభుత్వం స్పందించి మమల్ని ఆదుకోవాలి. వడగండ్లకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలి

-వంచా వీరారెడ్డి, మామిడి రైతు, చల్లూరు

ప్రభుత్వ సాయం అందించాలి

మామిడితోట సాగు చేసే రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏటా వివిధ రకాలుగా నష్టాల పాలవుతున్నాం. ప్రభుత్వానికి మొర పెట్టుకున్న రూపాయి సాయం అందడం లేదు. మామిడితోటలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– గుంటి మధుసూదన్‌రెడ్డి, రైతు, జాల

Updated Date – Mar 20 , 2025 | 01:23 AM

Subscribe for notification