పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025,PM Internship Scheme 2025 : విద్యార్థులకు నెలకు రూ.5000.. పీఎం ఇంటర్న్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం – pm internship scheme 2025 registration begins apply at pminternship mca gov in

Written by RAJU

Published on:

PMIS 2025 Registration : ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం 2025 సెషన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళ్తే..

హైలైట్:

  • పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025
  • ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు
  • మార్చి 12 దరఖాస్తులకు చివరితేది
Samayam Teluguప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం 2025
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం 2025

PM Internship Scheme 2025 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. కేంద్ర ప్రభుత్వం (Government Of India) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025 ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పించనుంది. ఈ ఏడాదికి ఇప్పటికే పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025 (PMIS) నోటిఫికేషన్‌ విడుదలై.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు తాజాగా ప్రారంభమయ్యాయి. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ ఇదే. మార్చి 12 దరఖాస్తులకు చివరితేది. భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 (PMIS) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. 10వ తరగతి లేదా 12వ తరగతి, యూజీ లేదా పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్ధులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైపెండ్‌ అందజేస్తారు. దీనితోపాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌ టైం గ్రాంట్‌) కూడా చెల్లిస్తారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్‌ రూం ట్రైనింగ్‌.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఉంటుంది.

PM Internship Scheme 2025 వివరాలను పరిశీలిస్తే..

భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) తన అధికారిక పోర్టల్ https://pminternship.mca.gov.in/login/ వెబ్‌సైట్‌ ద్వారా PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు ప్రకటించింది. 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్, UG/ PG డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండి.. వయసు 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. భారత పౌరసత్వం అవసరం. పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ ఉద్యోగం చేయకూడదు.

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6,000 స్టైపెండ్ అందజేస్తారు. భారతదేశంలోని అగ్రగామి 500 కంపెనీల్లో (ఆటోమొబైల్స్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లో) పని చేసే అవకాశం కల్పిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకానికి రూ.800 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. 2024 అక్టోబర్ 3వ తేదీన అధికారికంగా ప్రారంభమైన ఈ పథకం నైపుణ్యాభివృద్ధి, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ని నిరుద్యోగ యువతకు అందించడమే ఈ స్కీమ్‌ లక్ష్యం.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification