పాతుకుపోయారు…!

Written by RAJU

Published on:

-సింగరేణిలో అధికారుల ఇష్టారాజ్యం

-ఏడెనిమిదేళ్లకుపైగా ఒకే చోట ఉద్యోగం

-సంస్థలో 250 మంది వరకు ఇలాంటి ఆఫీసర్లే

-అనుయాయులకు నచ్చినచోట పోస్టింగ్‌లు

మంచిర్యాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సంస్థ నిబంధనలకు విరుద్దంగా ఏళ్ల తరబడి ఒకటే చోట ఉద్యోగం చేస్తూ అవినీతి, అక్ర మాలకు పాల్పడుతున్నారు. నజరానాలు ఇచ్చే కింది స్థాయి ఉద్యోగులకు నచ్చినచోట పోస్టింగులు ఇప్పి స్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణిలో అధికారులను మచ్చిక చేసుకుంటున్న కొందరు కిందిస్థాయి ఉద్యో గులు, కార్మికులు మస్టర్లు పడి వెళ్లిపోవడం ఓ వైపు జరుగుతుంటే, ఇప్పుడు కొందరు లాంగ్‌ స్టాండింగ్‌ అధికారుల అవినీతి కారణంగా సంస్థ అబాసు పాల య్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం స్వ యంగా సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌ దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీర్ఘకాలిక పోస్టింగ్‌లో వందలాది మంది….

సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో ఒకేచోట దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న అఽధికారులు సు మారు 250 మంది వరకు ఉంటారని సమాచారం. వీరంతా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న చోటే ఎని మిదేళ్ల నుంచి పదేళ్ల వరకు కొనసాగుతున్నట్లు తె లుస్తోంది. ఉన్నచోటనే దీర్ఘకాలికంగా విధులు నిర్వ హిస్తున్న అధికారుల్లో అండర్‌ మేనేజర్లు, మేనేజర్లు, పర్సనల్‌ ఆఫీసర్లు, ఇంజనీర్లు ఉన్నారు. వీరిలో 90 శాతం మేర అవినీతికి ఆజ్యం పోస్తూ ఇష్టారీతిన వ్య వహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్క శ్రీరాం పూర్‌ డివిజన్‌లోనే 27 మంది వరకు లాంగ్‌ స్టాం డింగ్‌ అధికారులు విధుల్లో ఉండటం గమనార్హం. వీ రంతా తన కిందిస్థాయి అధికారుల సహకారంతో ఇతర ఉద్యోగులు, కార్మికులకు అనుకూలమైన చోట పోస్టింగులో ఇప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు అండర్‌ గ్రౌండ్‌లో పనిచేసే కార్మికు డు సర్ఫేస్‌కు రావాలంటే సదరు అధికారులను ఆశ్ర యిస్తేచాలు అప్పటికప్పుడే పని అయిపోతుందనే ప్ర చారమూ జోరుగా సాగుతోంది. అలా అవినీతి అధి కారుల అండదండలతో అర్హతలేని వారు ఎందరో స ర్ఫేస్‌లో విధులు నిర్వహిస్తుండగా, అన్ని అర్హతలు న్న కార్మికులు మాత్రం దొడ్డిదారి మార్గం దొరక్క అండర్‌ గ్రౌండ్‌లలోనే మగ్గాల్సిన పరిస్థితులు ఉన్నా యనే అభిప్రాయాలు ఉన్నాయి.

జోరుగా డబ్బు, నజరానాలు….

ఏళ్లతరబడి ఒకటే చోట తిష్టవేసిన కొందరు అధి కారులు గనులపై తాము ఆడిందే ఆటగా వ్యవహ రిస్తున్నారు. తమ అనుయాయులకు తేలికైన పని ఇచ్చినందుకుగాను పెద్ద మొత్తంలో డబ్బులు, ఇతర నజరానాలు అందుకుంటున్నట్లు బాహాటంగా ప్రచా రం జరుగుతోంది. కొందరు అండర్‌ మేనేజర్లు వారి కింద పనిచేసే ఓవర్‌మన్లను దగ్గర పెట్టుకుని వారి ద్వారా పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. కొం దరు మేనేజర్లు సింగరేణి హెడ్‌ ఆఫీస్‌లో పై అధికా రులతో సత్సంబంధాలు పెట్టుకుని తమకు బదిలీలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్థానికంగా గను లపై అధికారాలు చలాయిస్తున్నారు. అలాగే కొందరు ఇంజనీర్లు గనుల్లో ఇతర విభాగాల్లో విధులు నిర్వ హించే ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లను తమ పరిధిలోకి తీ సుకోవడం ద్వారా తేలికైన పనులకు పురమాయిస్తు న్నారన్న ఆరోపణలున్నాయి. శ్రీరాంపూర్‌ డివిజన్‌కు చెందిన ఓ ఇంజనీరు స్థానికంగా ఓ గనిలో పదేళ్లకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అ వినీతికి అంతం లేకుండా పోయిందనే ప్రచారం జరు గుతోంది. డబ్బులు ఇచ్చిన కిందిస్థాయి ఉద్యోగులకు తేలికైన పనులు అప్పగిస్తుంటాడని సమాచారం. అ లాగే ఇదే డివిజన్‌లోని ఓ మేనేజర్‌ కూడా ఏదో ఒక నజరానా ఇస్తే పనులు చక్కబెడతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా అక్రమ మార్గంలో పనులు చక్కబె డుతున్న అధికారులు ఒక్కో పనికి రూ. 5వేలు నగ దు, ఇతర నజరానాలు అందుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

జాబితా పంపాలంటూ ఆదేశాలు….

సింగరేణిలో పదేళ్లకుపైగా ఒకేచోట విధులు నిర్వ హిస్తున్న అధికారుల వివరాలు పంపాలంటూ వివిధ ఏరియాల జీఎంలకు ఇటీవల సీఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జీఎంల విచారణలో సిం గరేణి వ్యాప్తంగా 250 మందికిపైగా లాంగ్‌ స్టాండిం గ్‌ ఆఫీసర్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. జాబితా లు అందగానే గంపగుత్తగా లాంగ్‌ స్టాండింగ్‌ ఆఫీ సర్లందరినీ ఒకేసారి ట్రాన్స్‌ఫర్‌ చేయకపోయినా… అంచలంచెలుగా వారికి స్థాన చలనం కలిగించేం దుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలి….

ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

సింగరేణిలో మూడేళ్లు ఒకేచోట విధులు నిర్వహిం చిన అధికారులను బదిలీ చేయాలి. కొందరు లాంగ్‌ స్టాండింగ్‌ అధికారుల మూలంగా సంస్థలో అవినీతి పెరిగిపోయింది. ప్రతిపనికీ డబ్బులు వసూలు చే యడం పరిపాటిగా మారింది. ఈ విషయమై గత నెల 7న జరిగిన స్ట్రక్చర్‌ మీటింగ్‌లో చైర్మన్‌ను ప్రశ్నిం చాము. ఒక్కసారిగా కాపోయినా ఈ సంవత్సరం లోపు లాంగ్‌ స్టాండింగ్‌ అధికారులకు స్థానచలనం కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు.

Subscribe for notification
Verified by MonsterInsights