పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనతో పాటు పాకిస్తాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. సాధారణ యుద్ధం జరిగితే.. ఇండియాతో తలపడేందుకు శక్తి, సామర్థ్యాలు పాకిస్థాన్ వద్ద లేనందున పాక్ అణ్వాయుధాలను ఉపయోగించవచ్చని కొంతమంది నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా 1945 ఆగస్టులో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై ఒక్కొక్క అణు బాంబును వేసినట్లు పాక్ కూడా ఇండియాపై అణుబాంబు దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.
అప్పటి కంటే ఇప్పటి అణ్వాయుధాలు మరింత శక్తివంతంగా, విధ్వంసకరంగా ఉన్నాయి. అణు బాంబు భయం ఎక్కువగా ఉండటంతో ఒక వేళ నిజంగానే ఇండియాపై పాక్ అణు దాడి చేసినా.. ఇండియాలో కొన్ని ప్రాంతాలు మాత్రం చాలా సురక్షితంగా ఉంటాయి. అధిక జనాభా ఉండే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు మొదటి లక్ష్యాలలో ఉండే అవకాశం ఉంది. మారుమూల ప్రాంతాలపై బాంబు దాడులు జరగకపోవచ్చు అని నిపుణులు అంటున్నారు. కానీ, అణు దాడి జరిగితే మాత్రం పాక్షికంగా మాత్రం ప్రభావం అయితే ఉంటుంది. అణు దాడి సమయంలో ఇటుక లేదా కాంక్రీట్ గోడలతో కూడిన దృఢమైన భవనాలలో ఆశ్రయం పొందడం, తక్షణ పేలుడు తరంగం, రేడియేషన్ నుండి రక్షించడానికి చాలా ముఖ్యమైనది.
అణు దాడి జరిగితే దీర్ఘకాలిక మనుగడ అనేది ఆహార లభ్యత, నీటి వనరులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అణు యుద్ధం జరిగితే, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఈశాన్య ప్రాంతాల వంటి భారతదేశంలోని మారుమూల ప్రాంతాలు, ప్రధాన నగరాలతో పోలిస్తే మనుగడకు కొంచెం మెరుగైన అవకాశాన్ని అందించవచ్చు. అయితే, ఈ ప్రాంతాలు కూడా పూర్తి భద్రతకు హామీ ఇవ్వలేవని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. పాకిస్థాన్ పిచ్చి పనులతో ఎలా వ్యవహరిస్తుందనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి