బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యంపై 24 గంటల్లో రెండవ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది గాయపడినట్లు కూడా సమాచారం. పాకిస్తాన్ సైన్యంపై ఈ దాడి కెచ్ జిల్లాలో జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబులతో దాడి చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.
శుక్రవారం(మార్చి 14) నాడు, బలూచ్ సైన్యం పాకిస్తాన్ బందీలుగా ఉంచిన 214 మంది సైనికులను హతమార్చింది. ఖైదీలను మార్పిడి చేసుకోవడానికి పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. కానీ పాకిస్తాన్ సైన్యం నుండి షాబాజ్ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. షాబాద్ మొండితనం కారణంగా 214 మంది సైనికులు మరణించారు.
మరోవైపు బలూచిస్తాన్ రైలు దాడిలో మరణించిన 26 మంది బందీలలో 18 మంది భద్రతా సిబ్బంది అని పాకిస్తాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సైన్యం ఆపరేషన్ ప్రారంభించే ముందు ఉగ్రవాదులు 26 మంది బందీలను చంపారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. 18 మంది భద్రతా సిబ్బందితో పాటు, మరో ముగ్గురు ప్రభుత్వ అధికారులు, ఐదుగురు పౌరులు కూడా ఉన్నారు.
ఇదిలావుంటే, 300 మందికి పైగా ప్రయాణికులను రక్షించడంలో భద్రతా దళాలు 33 మంది ఉగ్రవాదులను చంపాయని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. 37 మంది గాయపడిన ప్రయాణికులతో సహా మొత్తం 354 మంది బందీలను రక్షించినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మంగళవారం బలూచిస్తాన్‌లోని బోలాన్ ప్రాంతంలో 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మెరుపుదాడి చేసి, ప్రయాణికులను బందీలుగా పట్టుకుంది.
ప్రతిరోజు లాగే, మార్చి 11న, జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుండి పెషావర్‌కు బయలుదేరింది. రైలులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బలోన్ కొండలలోని ఒక సొరంగం గుండా రైలు వెళుతుండగా, ఆకస్మికంగా హైజాక్ చేసిన బలోచ్ ఆర్మీ యోధులు దానిపై దాడి చేశారు. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు సహా 58 మంది మరణించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..