బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. దక్షిణ కార్మీర్‌లోని టాంగ్‌మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుతున్నట్టు తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) టాప్ కమాండర్ చిక్కుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన TRF ఈ కాల్పులకు జరిపినట్టు ప్రకటించింది.
అయితే బుధవారం తెల్లవారుజామున బారాముల్లా ప్రాంతంలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం అంతమొందించింది. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాదుల నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..