పవర్‌ఫుల్‌ కథతో..

Written by RAJU

Published on:

పవర్‌ఫుల్‌ కథతో..అశ్విన్‌ బాబు హీరోగా, మామిడాల ఎం.ఆర్‌.కష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వచ్చిన వాడు గౌతమ్‌’. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సోమవారం పవర్‌ ఫుల్‌ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేసారు. డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అశ్విన్‌ బాబు నుండి వస్తున్న మరో ఎగ్జైటింగ్‌ మూవీ ఇది. బ్లెడ్‌, స్టెత్‌తో ఉన్న అశ్విన్‌ బాబు లుక్‌ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. మెడికల్‌ యాక్షన్‌ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి రోణక్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 90% చిత్రీ కరణను పూర్తి చేసుకుంది. త్వరలో మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తారు. రియా సుమన్‌, అయేషా ఖాన్‌, మురళీ శర్మ, సచిన్‌, ఖేడేకర్‌, అభినయ, అజరు, వీటీగణేష్‌, యెష్నా చౌదరి, సుదర్శన్‌, శకలక శంకర్‌, రాఘవ, అమర దీప్‌, అభిత్‌ భూషణ్‌, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights