ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా అగ్నిప్రమాదం కారణంగా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లటంతో మార్క్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది వెంటనే అతడ్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. వైద్యులు మార్క్ కు చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అరకు పర్యటన ముగించుకుని తనయుడిని చూసేందుకు సింగపూర్ కు బయలుదేరుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేటీఆర్ తో సహా పలువురు ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అవుతూ.. `సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.` అంటూ ట్వీట్ చేశారు.
నారా లోకేష్.. `సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. ఈ ప్రమాదంలో పవన్ అన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బలం మరియు ప్రార్థనలు ఉండాలి` అంటూ ట్వీట్ చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. `సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబంతోనే ఉన్నాయి. మార్క్ త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.` అంటూ ట్వీట్ చేశారు. విపక్షంలో ఉన్నా, రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్న పవన్ కుమారుడి విషయం తెలియగానే జగన్ రియాక్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జగన్ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
ఇక మార్క్ కు జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. `సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.` అంటూ ట్వీట్ చేశారు.
The post పవన్ కుమారుడికి గాయాలు.. జగన్ రియాక్షన్ వైరల్! first appeared on namasteandhra.