
మండలంలోని మునీరాబాద్ గ్రామానికి చెందిన మండల నాయకులు తొంట సత్యనారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడంతో వారిని ఆలేరు ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన మండల సినియర్ నాయకులు ఉప్పల బాబు, ఉప్పల కృష్ణ తల్లి మరణించడం తో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. సోలిపేట గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన చీర్ల యాదమ్మ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, మాజీ సర్పంచులు హారిక లక్ష్మా రెడ్డి, నవీన్ గౌడ్, బూడిద శంకర్, ఉపసర్పంచులు చందర్ నాయక్, దండు యాదగిరి, మండల నాయకులు పోషంరెడ్డి,శ్రీకాంత్ గౌడ్, సింహ రెడ్డి, మైలారం రామకృష్ణ, బాలనర్సయ్య గౌడ్, నిరుగొండ రమేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, వంశీ, గ్రామ శాఖ అధ్యక్షులు బాలయ్య, రాజు నాయక్, రమేష్ గౌడ్, శే ఖర్ గౌడ్, బాలేష్ గౌడ్, అశోక్ నాయక్, జోగు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.