
నవతెలంగాణ పెద్దవంగర:
పక్వానికి రాని వరి పంటలను కోయొద్దని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. అవుతాపురం గ్రామంలోని రైతులు, హార్వెస్టర్ డ్రైవర్ లకు వారి కోతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వరి కోతల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు గానీ, హార్వెస్టర్ మళ్లీ దొరకదేమో అనే సందర్భాల్లో గానీ రైతులు తమ పంట పూర్తి స్థాయిలో పక్వానికి (కోతకు) రాకపోయినా కోతలకు తొందరపడే అవకాశం ఉంటుందన్నారు. పక్వానికి రాకముందే కోస్తే తప్ప, తాలు వస్తాయన్నారు. రైతుకు నష్టం జరగకుండా వరి కోతలు చేపట్టాలన్నారు. పెద్దవంగర, గంట్లకుంట, పోచంపల్లి, ఆర్సీ తండాల్లోని ధ్యానం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం రమణాచారి, పీఏసీఎస్ సీఈవో మురళితో కలిసి సందర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించాలన్నారు. దళాలను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు.