పండిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దు

Written by RAJU

Published on:

పండిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దు– డి.సి.సి.బి డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న
నవతెలంగాణ- చండూరు
రైతులు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మ మోసపోవద్దని, డి.సి.సి.బి డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న అన్నారు. చండూరు రైతు సేవా సహకార సంఘం ఆద్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని కస్తాల గ్రామంలోని రైతు వేదికలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ యొక్క వడ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ – ఏ కు 2302/- గ్రేడ్ – బీ కు 2300/- రూపాయలు పొందాలని, రైతులు తమ వడ్లను దళారులకు అమ్మి మోసపోవద్దు అని ప్రభ్యుత్వం తెలిపిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మద్దతు ధర పొందాలని, 17% లోపు ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమము లో మానిటరింగ్ ఆఫీసర్ జ్యోతిర్మయి ,ఎంపీడీఓ బండారు యాదగిరి, డిప్యూటీ తహసిల్దార్ నిర్మల, మండల వ్యవసాయ అధికారి చంద్రిక , ఏ ఈ ఓ భార్గవి , సంఘ డైరెక్టర్లు కట్ట భిక్షం,మొగుదాల దశరథ,బనావత్ ఘాంసి రామ్ ,సంఘ సెక్రటరీ పాల్వాయి అమరేందర్ రెడ్డి, పి.పి.సి ఇంచార్జీ భూతరాజు ఫణీంద్ర కుమార్ , సిబ్బంది, మాజీ ఎంపీటీసీ నాతాల వనజ విష్ణు వర్ధన్ ,మాజీ ఉప సర్పంచ్ ఉరుగుండ్ల వెంకన్న ,పంగ రామకృష్ణ ,పందిరి రాధ ,మేకల సాగర్ రెడ్డి, రైతులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Subscribe for notification
Verified by MonsterInsights