ABN
, Publish Date – Mar 22 , 2025 | 11:40 PM
నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సం ఖ్య తగ్గుతుందని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌కా ర్యాలయంలో శనివారం కోర్టు డ్యూటి పని చేస్తున్న అధికారులకు లైజనింగ్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు.

ప్రశంస పత్రాలను అందజేస్తున్న రామగుండం అంబర్‌కిషోర్‌ఝా
రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సం ఖ్య తగ్గుతుందని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌కా ర్యాలయంలో శనివారం కోర్టు డ్యూటి పని చేస్తున్న అధికారులకు లైజనింగ్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా విధుల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలను అందజే శారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులకు శిక్షపడే విధంగా సాక్షుల ను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలన్నారు. కోర్టులో బాధితుల కు న్యాయం జరిగే విధంగా మానవత్వంతో మెలగాలన్నారు. దోషులకు శిక్షపడ డంలో కోర్టు, కానిస్టేబుళ్ల బాధ్యత కీలకమైందన్నారు. నేరస్తులకు వారెంటు, సమ న్లు సత్వరమే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు ప్రాసి క్యూషన్ సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసరుకు తెలియజేయాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు పాటించాలని, పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు సీసీటీఎస్ ఎస్‌లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. మెజిస్ర్టేట్ బాధితులు కోర్టు డ్యూటి కానిస్టేబుల్ మంచి క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలన్నారు. ఏదైన నేరం చేసి న వారికి చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడే వ్యక్తులు తప్పకుండా శిక్షపడేలా కృషి చే యాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లా రెడ్డి, లీగల్‌సెట్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, చంద్రశేఖర్‌గౌడ్, సీసీ హరీశ్‌తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జోన్ కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Updated Date – Mar 22 , 2025 | 11:40 PM