నవతెలంగాణ – అశ్వారావుపేట
నూతన వంగడాలు ఉత్పత్తి,పంటలు కు సోకే చీడపీడలు పై పరిశోధనలను విస్తృత పరచాలని శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి.లక్ష్మీనారాయణ హెచ్ ఆర్ఎస్ శాస్త్రవేత్త డా.జి.విజయ్ కృష్ణ కు ఆదేశించారు.ఎప్పటికప్పుడు తోటలను సందర్శించి పరిశోధనలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. అశ్వారావుపేట మండలం అల్లిగూడెం లో బూడిద గుమ్మడి,మునగ, మిర్చి, దమ్మపేట మండలం లింగాలపల్లి లో మామిడి తోటలను సందర్శించారు. తోటల నిర్వాహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఆయన వెంట హెచ్ ఆర్ఎస్ సైంటిస్ట్ డా. విజయ్ కృష్ణ, సిబ్బంది ఉన్నారు.
పరిశోధన ఫలసాయం వేలం…
స్థానిక శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన పరిశోధనా కేంద్రానికి పరిశోధనా పంటల ఫలసాయం వేలం ద్వారా రూ. 10,73,500 ఆదాయం లభించింది. హెచ్ ఆర్ఎస్ (ఉద్యాన పరిశోధనా స్థానం – హార్టికల్చరల్ రీసర్చ్ స్టేషన్)లో శనివారం నిర్వహించిన తేటల వేలం లో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. మూడేళ్ళ పాటు కొబ్బరి కాయల సేకరణకు రూ.7,58,600, ఏడాదికి జీడిమామిడి రూ.50 వేలు, పనస రూ.3,500, సపోటా రూ.37 వేలు, మామిడి సేకరణ రూ.2.20 లక్షలకు తోటలను వ్యాపారులు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ములుగు డైరెక్టర్ అఫ్ రీసర్చ్ డాక్టర్ లక్ష్మీనారాయణ, మల్యాల, అశ్వారావుపేట హెచ్ ఆర్ఎస్ సైంటిస్ట్ లు డాక్టర్ కె.నాగరాజు, డాక్టర్ విజయ్ కృష్ణ,పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.