నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల నూతన తహసీల్దార్ శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం నుండి ఆయన బదిలీపై పెద్దవూర కు వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసిల్దార్ సరోజ దేవరకొండ ఆర్డీఓ ఆఫీస్ లో ఏవోగా బదిలీఅయ్యారు. ఆమె స్థానంలో బాధ్యతలు చేపట్టిన నూతన తహసీల్దార్ ను ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, కోటఅంజి,ఆంజనేయులు ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటు రెవెన్యూ పరమైన నమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రెవెన్యూ సిబ్బందికూడ నూతన తహసీల్దార్ కు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆస్ఐ లు దండ శ్రీనివాస్ రెడ్డి, అబీబ్, ధరణి ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.