nta.nic.in admit card 2025 : మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ 2025 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లలో ఎన్‌టీఏ నిమగ్నమై ఉంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేసింది.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. వీటిలో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం వంటి తదితర సమాచారం ఉంటుంది. ఇది హాల్ టికెట్ కాదు.. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో కానీ.. చెక్‌చేసుకోవడంలో కానీ ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థులు 011-40759000/ 011-69227700 నంబర్లలో లేదా neetug2025@nta.ac.in. ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఇక.. National Eligibility Cum Entrance Test NEET యూజీ 2025 పరీక్షను మే 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించన్నారు. నీట్ యూజీ 2025 పరీక్ష తొలుత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. గతేడాది 24 లక్షల మంది అభ్యర్ధులు నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
మొత్తం 180 నిమిషాలు (3 గంటలు) పాటు నీట్ యూజీ 2025 రాత పరీక్ష ఉంటుంది. గతంలో ఉన్నట్టే ప్రతి సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు ఉంటాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ ఏడాది నీట్ యూజీ 2025 నుంచి మార్పులు చేసింది ఎన్‌టీఏ. తిరిగి పాత విధానాన్ని కొనసాగించేందుకు నిర్ణయించింది. అంటే సెక్షన్ బీ ఆప్షన్, అదనపు సమయం ఉండదు. అదనంగా 20 ప్రశ్నలు ఉండవు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంటే ఇకపై 180 ప్రశ్నలకు మూడు గంటల సమయం ఉంటుంది. గతంలో ఉన్నట్టే ప్రతి సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలుంటాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నల చొప్పున ఉంటాయి. NEET UG పరీక్ష సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలు నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.