మినరల్ వాటర్ పేరుతో బోరు వాటర్ అమ్మకాలు
-పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు
-చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
మంచిర్యాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్నాయి….గొంతు తడుపుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటి ని కొనుక్కోవాల్సిన పరిస్థితి…ప్రజల అవసరాన్ని ఆస రా చేసుకొని కొందరు నీళ్ల దందాకు శ్రీకారం చుడు తున్నారు. ఇష్టారాజ్యంగా శుద్ధజల ప్లాంట్లను నెలకొ ల్పుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ మినర ల్ వాటర్ పేరిట బోరు నీటిని అమ్ముతున్నారు. అం దినకాడికి దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగా టమాడుతున్నారు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారు లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మినరల్ వాటర్ పేరుతో…
మినరల్ వాటర్ పేరుతో కొంతమంది వ్యాపారు లు మామూలు నీటిని సరఫరా చేసి అక్రమంగా డ బ్బు సంపాదనకు తెరలేపారు. వేసివి కాలంలో మి నరల్ వాటర్ (బోరు నీరు) ప్లాంట్లు పుట్టగొడుగు ల్లా పుట్టుకొస్తున్నాయి. బోరు నీటికి కొన్ని రసాయ నాలు కలిపి మినరల్ వాటర్ పేరుతో అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకునే వారులేరు. జిల్లాలో ఎ లాంటి అనుమతులు తీసుకోకుండా చాలా మంది మినరల్ వాటర్ పేరుతో నీటిని విక్రయిస్తున్నారు. అయినా అధికారుల ధృష్టికి రాకపోవడం అనుమానా లకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లలో అనేక వాటికి అనుమతులు లేవని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉండగా, వాటిలో 90శాతం మేర ఎక్కడా కూడా నిబంధనలు పాటించడం లేదు.
నిబంధనలు ఇవీ…
ఆదునిక యంత్రాల సహాయంతో నీటిని మూడు దశల్లో మినరల్ వాటర్‌గా తయారు చేయాల్సి ఉం టుంది. ముందుగా నీటిని క్లోరినేషన్ చేస్తారు. ఆ నీ టిని ప్రత్యేకమైన శాండ్ ఫిల్టర్ ద్వారా వడబోసి కా ర్బన్, మైక్రాన్ ఫిల్టర్ల ద్వారా శుభ్రం చేయాల్సి ఉం టుంది. తరువాత మరో కంపార్ట్‌మెంట్‌లోకి నీటిని పంపి అలా్ట్ర వైలెట్, ఓజోనైజేషన్ ప్రక్రియ ద్వారా ఎ టువంటి సూక్ష్మ క్రిములు లేకుండా మార్చాల్సి ఉం టుంది. చివరి దశలో ఆక్సీజన్ పంపడం ద్వారా ఆక్సీ కరణ జరిపి రంగు, రుచి, వాసన లేకుండా శుద్ధి చే యాలి. అనంతరం ప్రతీ లీటర్ నీటిలో 75 ఎంఎల్ కాల్షియం, 35 ఎంజీ మెగ్నీషియం, 0.3 ఎంజీ ఐరన్ ఉండేలా చూడాలి. క్లోరైడ్ ఒక మిల్లీగ్రామ్ మించకుం డా జాగ్రత్తలు వహించాలి. ఇలా తయారు చేసిన నీ రు వారం రోజుల లోపు వినియోగించాలి. ప్రతి ఆర్ వో ప్లాంట్‌లో ఆహార కల్తీ తనిఖీ భారత ప్రమాణ సంస్థ (ఐఎస్‌ఐ)లోని 145, 43 సెక్షన్‌ల కింద రిజిస్టర్ కావాలి. అయితే జిల్లాలో ఈ నిబంధనలన్నీ కాగితా లకే పరిమితం కావడం గమనార్హం. పెళ్లిళ్లు, ఇతర కార్యాలలో వాటర్ క్యాన్‌ల వినియోగం పెరిగిపోవ డంతో వ్యాపారులు బోరు నీటిని వ్యాన్లలో నింపి అం దులో కొన్ని రసాయనాలను కలిపి విక్రయిస్తున్నా రనే ఆరోపణలున్నాయి.
కానరాని తనిఖీలు…
అక్రమ నీటి వ్యాపారం సంబంధిత అధికారులకు తెలిసినా తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలున్నా యి. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని ప్లాంట్లు ని ర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. జిల్లాలో 400 పై చిలుకు మినరల్ వా టర్ ప్లాంట్లు, ఆర్‌వో ప్లాంట్ల పేరుతో నీటి విక్రయా లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న గదిలో నిర్వాహకులు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్లాంట్లలో తయారు చేసిన నీటిని 20 లీటర్ల క్యాన్‌కు రూ. 20, కూల్ వాటర్ అయితే రూ. 40 చొ ప్పున అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం మిన రల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఐఎస్ వో స్టాండర్డ్స్ పాటించాలి. కానీ అలా పాటించాలంటే సు మారు రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. అయితే చాలా మం ది అంతంత పెట్టుబడి పెట్టలేక తక్కువ ఖర్చుతో నిబంధనలకు విరుద్ధంగా మినరల్ వాటర్, ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం చేస్తున్నారు.
అనారోగ్యాలకు మూలం…
అనారోగ్యాలకు ప్రధాన కారణం తాగునీరేనని వై ద్యులు చెబుతుంటారు. కాచి, వడబోసి తాగమని స లహా ఇస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా మి నరల్ వాటర్ పేరుతో సాధారణ జలాన్ని ప్రజలకు అందిస్తున్నారు. కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా చే రడం మూలంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మినరల్ వాటర్ పేరుతో జరుగుతున్న వి క్రయాల్లో ఫంగస్ చేరి ప్రజలు రోగాల బారిన పడు తున్నారు. పూర్తిగా శుభ్రం చేయని నీటిలో ఈకొళి బ్యాక్టీరియా, కోళీఫార్మా ఎక్కువగా ఉండటం అనారో గ్యానికి కారణం అవుతుంది. వీటివల్ల టైఫాయిడ్, కా మెర్లు, అతిసారం, కడుపుమంట, గొంతు సంబంధి త వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చె బుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అనుమతులు లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.