
వాస్తు శాస్త్రం ప్రకారం మన రోజును ఎలా ప్రారంభిస్తామన్నది చాలా ముఖ్యమైన విషయం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఎలాంటి వస్తువులను చూస్తామో దానివల్ల మన ఆరోగ్యం, అదృష్టం, శ్రేయస్సుపై ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనం ఉదయం ఎలాంటి వస్తువులను చూడకూడదో తెలుసుకుందాం. వీటిని పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో చూడటం వాస్తు ప్రకారం అశుభం. ఈ అలవాటు ఉన్నవారు తమ ఆరోగ్యం క్షీణించటానికి అవకాశం ఉందని నమ్మకం. అద్దం మన ప్రతిబింబాన్ని చూపుతుందన్నది సత్యం కానీ ఉదయం తొలుత అద్దంలో చూడడం మన శరీరంలో శక్తి ప్రవాహాన్ని దెబ్బతీయవచ్చని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. కాబట్టి ఈ అలవాటు ఉంటే దాన్ని త్వరగా మార్చుకోవాలి.
ఇంట్లో విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలు ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఇటువంటి గడియారాలను చూడటం పనులు సక్రమంగా సాగకపోవటానికి కారణమవుతుంది. గడియారం కాలంతో సంబంధమైనది కాబట్టి ఆగిపోయిన గడియారం మన ప్రగతికి అడ్డంకిగా మారవచ్చని భావిస్తారు. కాబట్టి ఇంట్లో వాటిని ఉంచకపోవడం ఉత్తమం.
ఉదయం నిద్రలేచిన వెంటనే చీపురు లేదా చెత్తబుట్టను చూడటం కూడా శుభప్రదం కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇవి నెగటివ్ శక్తిని తీసుకురావచ్చని నమ్మకం. ఉదయం చీపురు లేదా చెత్తను చూడడం ఆర్థికంగా సమస్యలు ఎదురుకావటానికి అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీటిని దూరంగా ఉంచాలి.
రాత్రి వాడిన పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేయడం వల్ల ఉదయాన్నే అవి కంటపడతాయి. వాస్తు ప్రకారం ఇలా చేయడం అశుభం. ఉదయం శుభ్రంగా ఉండే వాతావరణం మన శరీరంలో పాజిటివ్ శక్తిని కలిగిస్తుంది. ముందుగా రాత్రి పాత్రలను శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇల్లు శుభ్రంగా ఉండటమే కాకుండా ఉదయాన్నే మనం చూసే వస్తువులు కూడా శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతాయి. కనుక వీటిని పాటించడం చాలా అవసరం.