– జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వినోద్
నవతెలంగాణ – దుబ్బాక
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వినోద్ అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం హబ్సిపూర్ లో మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు వండాలని, క్వాలిటీతో కూడిన కిరాణా సరుకులు, కూరగాయలనే కొనుగోలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి,ఉపాధ్యాయులు ఉన్నారు.