
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసారు. ఎఫ్ఆర్ఓ మురళి తెలిపిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం రెండు గంటల సమయంలో కావడిగుండ్ల ఎఫ్ఎస్ఓ,కంట్లం ఎఫ్.బీ.ఓ లు, కంట్లం బేస్ క్యాంపు సిబ్బంది గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీప అటవీ ప్రాంతంలో గస్తీ చేస్తుండగా ముగ్గురు (3) వ్యక్తులు 2 నాటు తుపాకులతో అనుమానాస్పదంగా సంచరించడం గమనించారు. మా సిబ్బంది వారిని పెట్టకొని వారి వద్ద ఉన్న రెండు (2) నాటు తుపాకులను స్వాదీనం చేసుకొని అశ్వారావుపేట రేంజి కార్యాలయానికి తరలించి విచారించగా ఆంద్రప్రదేశ్,ఏలూరు జిల్లా,బుట్టాయిగూడెం మండలం కామవరం కు చెందిన కారం రవి,కామ మంగ బాబు,వంజం నవీన్ గా,వారు తెలంగాణ అటవీ ప్రాంతంలో వేట కు వచ్చినట్లు అంగీకరించారు.వీరి పై కేసు నమోదు చేసి కోర్టు కు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ మురళి తెలిపారు.