ABN
, Publish Date – Mar 08 , 2025 | 11:06 PM
మండలంలోని పెద్దినేనికాల్వ గ్రామ పంచాయతీ తూర్పు మాలపల్లి సమీపంలో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు.

తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ
సుండుపల్లె, మార్చి8(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దినేనికాల్వ గ్రామ పంచాయతీ తూర్పు మాలపల్లి సమీపంలో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. సారా తయారీ కోసం ఊట ను నిల్వ చేశారన్న సమాచారం రా వడంతో పోలీసులతో కలిసి తనిఖీ లు నిర్వహించి సుమారు 150 లీటర్ల ఊట ధ్వంసం చేశామన్నారు. నాటు సారా తయారీ కానీ, అమ్మకాలు కానీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలియజేశారు.పల్లెల్లో అమ్మకాలు చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Updated Date – Mar 08 , 2025 | 11:06 PM