దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..

Written by RAJU

Published on:


దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో భయానక ఘటన వెలుగుచూసింది. సంతానం కోసం ఓ వ్యక్తిని నరబలి ఇచ్చారు. సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తి తనకు సంతానం కలిగేలా పూజలు చేయాలని రిక్యాస్, ధర్మేంద్రను ఆశ్రయించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ నరబలి ఇవ్వాలని నిర్ణయించుకొని యుగుల్ యాదవ్ (65)ను కిడ్నాప్ చేసి తల నరికారు. తర్వాత ఆ తలను హోలీ మంటల్లో కాల్చేశారు. యాదవ్ మిస్సింగ్‌‌పై ఫిర్యాదు అందగా విచారణలో ఈ హత్య విషయాలు బయటపడ్డాయి.

మార్చి 19న గులాబ్ బిఘా గ్రామానికి చెందిన రాజా రామ్ యాదవ్ మదన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన అన్నయ్య యుగుల్ యాదవ్ బంగారే గ్రామానికి సమీపంలోని హోలికా దహన్‌లో పాల్గొనడానికి సైకిల్‌పై వెళ్లాడని, అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశాడు. హోలిక బూడిదలో కొన్ని కాలిన ఎముకలు కనిపించాయని, అతని సోదరుడి చెప్పులు కూడా సంఘటనా స్థలానికి సమీపంలోనే కనిపించాయని అతను పోలీసులకు చెప్పాడు. అలాగే, సమీపంలోని కల్వర్టుపై రక్తపు మరకలు కనిపించాయని పోలీసులకు వివరించారు.. తమ సోదరుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసి, అతని మృతదేహాన్ని హోలికాలో దహనం చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసుల టెక్నికల్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని, కాలిన ఎముకలు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు, రక్తం DNA నమూనాలను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ట్రాకర్ డాగ్ పోలీసు బృందాన్ని సమీపంలోని పురానాదిహ్ మంజితోలా గ్రామంలోని రామశిష్ రికియాసన్ ఇంటికి తీసుకెళ్లింది. కానీ అతను ఇంట్లో కనిపించలేదు. ఆ మరుసటి రోజు రికియాసన్ బంధువు ఇంట్లో ఉన్నాడని తెలిసి అక్కడే అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. పోలీసులు తమ స్టైల్లో విచారించగా, యుగుల్ యాదవ్ హత్యలో తన ప్రమేయాన్ని నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights