సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన సినిమా ‘కిల్లర్ ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించారు. రతన్ రిషి దర్శకుడు. ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్‌కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ, ‘హీరో సంతోష్, హీరోయిన్ క్రిషేక, సోనియా. .వీళ్లందరికీ మంచి పేరొస్తుంది. డైరెక్టర్ రతన్ రిషి కూడా వరుసగా సినిమాలు దక్కించు కుంటాడని నమ్ముతున్నా. ఈ చిత్రంతో సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తారు. ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమాని కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘సెన్సార్ వారి సూచన మేరకు ‘కిల్లర్ ఆర్టిస్ట్’ అని పెట్టుకున్నాం. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. మన సొసైటీలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఈ మర్డర్స్ ఒకరు చేస్తున్నారా ఇద్దరా అనేది ట్రైలర్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాం. సినిమాలోనూ అదే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ నుంచి ఈ కథ మొదలై, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుంటుంది. బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్..ఇలాంటి ఆర్టిస్టులంతా కొత్తగా మీకు కనిపిస్తారు. ఈ సినిమా మీకు కొత్త సినిమాటిక్ ఫీల్ కలిగిస్తుంది’ అని డైరెక్టర్ రతన్ రిషి చెప్పారు.

థ్రిల్ చేసే ‘కిల్లర్ ఆర్టిస్ట్’
Written by RAJU
Published on: