థర్డ్ అంపైర్‌కు కళ్లు దొబ్బాయా.. ధోనిని ఇలా మోసం చేస్తారా.. వివాదంగా మారిన మిస్టర్ కూల్ ఔట్?

Written by RAJU

Published on:


MS Dhoni Fails on CSK Captaincy Return: ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తిరిగి రావడం చెన్నై జట్టుకు ఏమాత్రం అచ్చిరాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ధోని.. తన నాయకత్వంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో ఎటువంటి మార్పు చూపించలేకపోయాడు. ముఖ్యంగా ధోనీ కూడా ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, అతను ఔట్ అయిన విధానం ప్రస్తుతం వివాదంగా సృష్టించాడు.

ఏప్రిల్ 11, శుక్రవారం చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌తో, ధోని దాదాపు 683 రోజుల తర్వాత ఐపీఎల్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్‌లో వరుసగా 5 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయిన చెన్నై జట్టు, ధోని కెప్టెన్‌గా తిరిగి రావడంతో జట్టుకు కొత్త శక్తి వస్తుందని, ఆటగాళ్ల ఉత్సాహం పెరుగుతుందని ఆశించారు. కానీ, అది జరగలేదు. మరోసారి చెన్నై బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇందులో ధోని కూడా బ్యాట్‌తో జట్టుకు ఎలాంటి సహకారం అందించలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ధోని ఔట్ అయిన విధానంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 15వ ఓవర్లో కేవలం 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితిలో మరోసారి ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అభిమానులు ధోని కొన్ని భారీ షాట్లు ఆడతాడని ఆశించారు. ఫినిషర్ పాత్రలో మరోసారి మెరుపులు మెరిపిస్తాడని ఆశపడ్డారు. కానీ, అతను కూడా తర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. మరోసారి స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 16వ ఓవర్ మూడో బంతికి ధోనీకి వ్యతిరేకంగా ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ ధోనిని అవుట్‌గా ప్రకటించాడు.

ధోని వెంటనే DRS తీసుకున్నాడు. అయితే, ఇక్కడే మొత్తం వివాదం మలుపు తిరిగింది. నిర్ణయం తీసుకోవడానికి థర్డ్ అంపైర్ స్నికోమీటర్ సహాయం తీసుకున్నాడు. అయితే, ఈ సమయంలో బంతి ధోని బ్యాట్‌కు దగ్గరగా వచ్చింది. స్నికోమీటర్‌పై కొంత కదలిక కనిపించిందని కనిపించింది. ఇది ధోనికి కొంత ఉపశమనం కలిగించినట్లు అనిపించింది. ధోని అవుట్ కాకుండా సేవ్ అవుతాడని అంతా భావించారు. కానీ, బంతి బ్యాట్‌కు తగలలేదని అంపైర్ చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత, బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకుతోందని స్పష్టమైంది. అందుకే ధోనిని అవుట్‌గా ప్రకటించారు. ధోని 4 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు.

ధోని అంపైర్‌తో వాదించకుండానే పెవిలియన్ చేరాడు. కానీ వెంటనే, జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫీల్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీతో మాట్లాడుతూ ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తాడు. బంతికి, బ్యాట్‌కి సంబంధం లేకపోతే, స్నికోమీటర్‌పై కదలిక ఏమిటంటూ ప్రశ్నలు కురిపించాడు. అసలు థర్డ్ అంపైర్ ఆ విషయాన్ని పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, దీనికి ఒక కారణం ఏమిటంటే, స్నికోమీటర్‌పై కదలికలు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. ఇందులో బ్యాట్, బంతి మధ్య సంబంధం మాత్రమే కారణం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధోని పాదాల కదలిక నుంచి శబ్దం వచ్చి ఉండవచ్చు, దాని కారణంగా ధోనిని అవుట్ అని ప్రకటించారు. కానీ, దీనిపై ఖచ్చితంగా వివాదం జరుగుతోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights